జాట్-2 అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. ఈసారి డబుల్ మాస్ ఫీస్ట్!
on Apr 17, 2025
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం 'జాట్' (Jaat). మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ ఫిల్మ్, ఏప్రిల్ 10న థియేటర్లలో అడుగుపెట్టింది. మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ చిత్రం, మంచి వసూళ్లు రాబడుతూ రూ.100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీక్వెల్ ని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. (Jaat 2)
సినిమా చివరిలో పార్ట్-2 ఉందని లీడ్ ఇవ్వడం లేదా సినిమా విడుదలై సక్సెస్ అయిన తర్వాత కొంతకాలానికి సీక్వెల్ ను అనౌన్స్ చేయడం కామన్ గా జరుగుతుంది. కానీ, 'జాట్' విషయంలో భిన్నంగా జరిగింది. సినిమా విడుదలైన వారం రోజులకే సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. సన్నీ డియోల్, మలినేని కాంబోలో రానున్న 'జాట్-2'లో మాస్ ఫీస్ట్ మరింత పెద్దదిగా, వైల్డ్ గా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. (Jaat Sequel)
ఇప్పటికే బాలీవుడ్ లో గోపీచంద్ మలినేని పేరు మారుమోగిపోతోంది. హిందీ ప్రేక్షకులు చాలాకాలంగా మిస్ అవుతున్న అసలుసిసలైన మాస్ ఫీస్ట్ ను 'జాట్'తో అందించాడు అంటూ అక్కడి క్రిటిక్స్, ఆడియన్స్ మలినేనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 'జాట్-2'తో ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ సీక్వెల్ హిట్ అయితే.. ఒక్కసారిగా బాలీవుడ్ స్టార్స్ చూపు మలినేనిపై పడే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
